- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశ్వాపురం అభివృద్ధికి మరో భారీ ముందడుగు..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది.

దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి అశ్వాపురం–మొండికుంట మధ్య రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రహదారిని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన రహదారి అందుబాటులోకి రావడంతో అశ్వాపురం మండల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కలుగనున్నాయని తెలిపారు.
గ్రామాల మధ్య అనుసంధానం బలోపేతం కావడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఈ రహదారి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు పలు స్థానిక సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ), డీసీసీ జిల్లా అధ్యక్షురాలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






