- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండపాకలో ఘనంగా ‘మన వార్డు - మన బాధ్యత’ సభ
కొండపాక మండల కేంద్రంలోని ఒకటో వార్డులో మన వార్డు - మన బాధ్యత’ పేరిట తొలిసారిగా వార్డు సభ నిర్వహించారు.

దిశ కొండపాక: కొండపాక మండల కేంద్రంలోని ఒకటో వార్డులో మన వార్డు - మన బాధ్యత’ పేరిట తొలిసారిగా వార్డు సభ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ , పాలకమండలి సభ్యుల సమక్షంలో జరిగిన ఈ సభలో ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చారు. అర్జీలను మినిట్స్ బుక్‌లో నమోదు చేసి, త్వరలోనే పరిష్కరిస్తామని వార్డ్ మెంబర్ యాదగిరి హామీ ఇచ్చారు. గత ఏడు నెలల్లో వార్డులో డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు మిషన్ భగీరథ నీరు అందని పది కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించామని ఆయన వివరించారు. ఒకటో వార్డును జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. తాము పాలకులం కాదు, ప్రజల సేవకులమని సర్పంచ్ నవీన పేర్కొన్నారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న వార్డ్ మెంబర్ యాదగిరిని గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






