సకాలంలో వర్షాలు కురవాలి.. పంటలు పండాలి..!

by Ratna Kumari |

సకాలంలో వర్షాలు కురిసి అన్నదాతల పొలాలు పాడిపంటలతో కళకళలాడాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సకాలంలో వర్షాలు కురవాలి.. పంటలు పండాలి..!
X

దిశ, తల్లాడ : సకాలంలో వర్షాలు కురిసి అన్నదాతల పొలాలు పాడిపంటలతో కళకళలాడాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో రైతులు సాగు పనులు చేపట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వర్షాల కోసం అల్లాను ప్రార్థించారు. స్థానిక ఈద్గా మైదానంలో ముస్లిం మతపెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో కలిసి పవిత్ర ఖురాన్ పఠించారు. కరవు పరిస్థితుల నుంచి రైతాంగాన్ని, ప్రజలను కాపాడి సమృద్ధిగా వర్షాలు కురిసేలా అనుగ్రహించాలని అల్లాను వేడుకున్నారు.

అలాగే లోకం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. రైతుల శ్రమకు తగిన ఫలితం దక్కి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం మతపెద్దలు షేక్ ఈసూబ్, అక్బర్, మౌలీ సాబ్ ముజీబ్, నిజాముద్దీన్, గాలి, జాన్ పాషా, మస్తాన్, మున్నా, సలీం, ముస్తఫా, అబ్దుల్ రెహమాన్, వద్దండి సాహెబ్, మే బల్లి, బాజీ, ఖాసీం, ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story