రాజమండ్రిలో మొదటి కరోనా కేసు.. 21 ఏళ్ల యువకుడికి కరోనా

by Ajay Maddhiboyina |

ఏపీలో క‌రోనా వైర‌స్ చాప‌కింద నీరులా పాకుతోంది. రాష్ట్రంలో కేసులు మెల్లిమెల్లిగా పెరుగుతుండ‌గా తాజాగా రాజ‌మండ్రిలో మొద‌టి క‌రోనా కేసు న‌మోదైంది.

రాజమండ్రిలో మొదటి కరోనా కేసు.. 21 ఏళ్ల యువకుడికి కరోనా
X

దిశ‌, వెడ్ డెస్క్: ఏపీలో క‌రోనా వైర‌స్ చాప‌కింద నీరులా పాకుతోంది. రాష్ట్రంలో కేసులు మెల్లిమెల్లిగా పెరుగుతుండ‌గా తాజాగా రాజ‌మండ్రిలో మొద‌టి క‌రోనా కేసు న‌మోదైంది. 21ఏళ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో యువ‌కుడికి రాజ‌మండ్రి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 16 కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం క‌రోనాతో వివిధ ఆస్ప‌త్రుల్లో ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. న‌లుగురు హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ముగ్గురు క‌రోనా నుండి కోలుకున్నారు. మ‌రోవైపు న‌లుగురు వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించారు.

ఏపీలో న‌మోద‌వుతున్న కేసులు ఒమిక్రాన్ ఆర్.5 వేరియంట్ గా గుర్తించారు. ఈ వేరియంట్ సోకిన‌వారిలో గొంతునొప్పి, జ్వ‌రం, త‌ల‌నొప్పి, ముక్కు కార‌డం, బాడీ పెయిన్స్, అల‌స‌ట లాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ బారిన‌ప‌డిన‌వాళ్లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రంలేద‌ని చికిత్స తీసుకుంటే న‌యం అవుతుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టి ఇప్పటి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 340 కేసులు న‌మోద‌య్యాయి. అయితే గ‌తంలో మాదిరిగా వైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మాత్రం మోగించ‌డంలేదు. దీంతో ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకుంటున్నారు.

Next Story