సీతమ్మ పాత్రను పోషించే అదృష్టం నాకు లభించడం నా పూర్వ జన్మ సుకృతం: సాయి పల్లవి

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-19 10:56:24  IST  )

ఈ పాత్రను నేనే స్వయంగా ఎంచుకున్నానని అనుకోను. ఆ పాత్రే నన్ను ఎన్నుకుంది, దీన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నాను.

సీతమ్మ పాత్రను పోషించే అదృష్టం నాకు లభించడం నా పూర్వ జన్మ సుకృతం: సాయి పల్లవి
X

దిశ, సినిమా: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పౌరాణిక కావ్యంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ యష్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ‘రామాయణ పార్ట్-1’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రెండో భాగాన్ని మాత్రం వచ్చే ఏడాది దీపావళికి థియేటర్స్‌లోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి, ఈ సినిమాలో సీత పాత్ర చేయడంపై చాలా ఎమోషనల్ అయ్యారు.

నటీనటులకు ఇలాంటి గొప్ప పాత్రలు దక్కడం అంత సులభం కాదని ఆమె అన్నారు. ఒక దేవత పాత్రను వెండితెరపై పోషించడం సాధారణ విషయం కాదని, ఆ పాత్రను అద్భుతంగా చూపించడం కోసం చిత్ర బృందం రాత్రింబగళ్లు కష్టపడుతోందని చెప్పారు. సీతామాత పాత్ర గురించి చెబుతూ.. "ఈ పాత్రను నేనే స్వయంగా ఎంచుకున్నానని అనుకోను. ఆ పాత్రే నన్ను ఎన్నుకుంది, దీన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మనం ప్లాన్ చేసుకుని, ఇలాగే నటిస్తాను అని ముందే రాసి పెట్టుకునే పాత్ర కాదు. సీతమ్మ పాత్రను పోషించే అదృష్టం నాకు లభించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా’’ అని వివరించారు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడం కోసం, కనీసం తన ఆలోచనల్లోనైనా తనను తాను చాలా నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ప్రయత్నించానని.. అలా చేయడం వల్లే సీత పాత్రలో తన ఉత్తమమైన నటనను ఆవిష్కరించగలిగానని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.

రామాయణ ట్రైలర్.. విజువల్ వండర్

Next Story