గాదె సాయికృష్ణకు పెద్దకర్మ నిర్వహించిన కుటుంబ సభ్యులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-19 10:32:07  IST  )

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ అయిన విషయం తెలిసిందే. అయితే సాయికృష్ణకు కుటుంబ సభ్యులు ఆదివారం పెద్దకర్మ నిర్వహించారు....

గాదె సాయికృష్ణకు పెద్దకర్మ నిర్వహించిన కుటుంబ సభ్యులు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ అయిన విషయం తెలిసిందే. అయితే సాయికృష్ణకు కుటుంబ సభ్యులు ఆదివారం పెద్దకర్మ నిర్వహించారు. మరణించిన డేట్, బూడిద లేకుండానే సాయికృష్ణకు కర్మకాండలు చేశారు. బూడిద, మరణించిన తేదీ చెపితే కర్మకాండలు చేసుకుంటామని చాలా సార్లు కుటుంబ సభ్యులు పోలీసులు, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. అయితే అక్కడ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. దీంతో సాయికృష్ణ ఫొటో పెట్టి కర్మకాండలు నిర్వమించారు. అయితే సాయికృష్ణ పెద్ద కర్మకు పిన్ని అడ్వకేట్ కనకదుర్గ హాజరుకాలేదు.

పీఎస్‌లో లాకప్ డెత్

కాగా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యారు. ఈ విషయాన్ని కోర్టులో ఈడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ సీఐ నాగరాజు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. అయితే సాయికృష్ణ కుటుంబ సభ్యులకు వైసీపీ నాయకులు అండగా నిలిచారు. రూ. 20 లక్షల వరకూ సాయం అందించారు. సాయికృష్ణ కర్మకాండలు నిర్వహించేందుకు కనీసం బూడిడైనా, లేదా చనిపోయిన తేదీని అయిన చెప్పాలని తల్లి విజయలక్ష్మి పలుమార్లు విన్నవించుకున్నారు. కానీ పోలీసులు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సాయికృష్ణకు కుటుంబ సభ్యులు ఆదివారం పెద్ద కర్మ నిర్వహించారు.

Next Story