జనరిక్ ఔషధాలపై జీరో టారిఫ్ : ట్రంప్ కీలక ప్రకటన

by Muthe.Rajitha |

విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు.

జనరిక్ ఔషధాలపై జీరో టారిఫ్ : ట్రంప్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాల (Generic Drugs) పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల జనరిక్ మందులపై ఎలాంటి సుంకాలు (టారిఫ్‌లు) ఉండబోవని, జీరో శాతం పన్ను మాత్రమే వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ పన్ను మినహాయింపు రెండేళ్ల పాటు, అంటే ఆగస్టు 2028 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా అమెరికాకు పెద్ద ఎత్తున జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే భారతీయ ఫార్మా రంగానికి రాబోయే రెండేళ్ల కాలానికి పెద్ద ఊరట లభించినట్లయింది.

అయితే ఈ రెండేళ్ల మినహాయింపు గడువు ముగిసిన తర్వాత అమెరికా ప్రభుత్వం అత్యంత కఠినమైన టారిఫ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. రెండేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత వచ్చే తొలి ఏడాదిలో జనరిక్ ఔషధాలపై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకం విధిస్తామని, ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఈ సుంకాలను ఏకంగా 200 శాతానికి పెంచనున్నట్లు స్పష్టం చేశారు. మందుల తయారీ కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించి, ఔషధాలను అమెరికాలోనే దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' (Truth Social) మీడియా వేదిక ద్వారా స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీలు అమెరికాలోనే తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఈ రెండేళ్ల కాలాన్ని గడువుగా విధిస్తున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.

Next Story