పథకాలు ఏవని ప్రశ్నిస్తే బూతులతో సమాధానం

by Taduka Kalyani |   (  Updated:2026-02-06 09:59:38  IST  )

ప్రభుత్వం ఇస్తామన్న పథకాలు అమలు చేయాలని ప్రశ్నిస్తే వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులతో సమాధానం చేబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పథకాలు ఏవని ప్రశ్నిస్తే బూతులతో సమాధానం
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : ప్రభుత్వం ఇస్తామన్న పథకాలు అమలు చేయాలని ప్రశ్నిస్తే వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులతో సమాధానం చేబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్నీ బంద్ అయ్యాయని ఎద్దేవా చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పదేండ్ల కేసీఆర్ పాలన చూశారని, ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూస్తున్నారని, ఈ మధ్య కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, ఉద్యోగులు తన వద్దకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారన్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, పర్మినెంట్ చేసింది కేసీఆర్, జీతాలు పెంచింది కేసీఆర్. కానీ ఆయన్ను ఓడగొట్టి కాంగ్రెస్ ను గెలిపించింది మీరే కదా అని తన వద్దకు వచ్చిన వారితో అన్నానని హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని ఇప్పుడు వాళ్ళు బాధ పడుతున్నారన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారన్నారు.

బీఆర్ఎస్ హయాంలోనే పటాన్ చెరు అభివృద్ధి

రూ.200 ఉన్న పెన్షన్ రూ.2 వేలు చేసింది కేసీఆర్ అని, రేవంత్ రెడ్డి రూ.4 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశాడని మండిపడ్డారు. ఈ 24 నెలల్లో ఒక్కో అవ్వతాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.52 వేలు బాకీ పడిందని, అత్తా కోడలు ఇద్దరికీ రూ.2500 ఇస్తానని చెప్పి ఇద్దరికీ మొండిచేయి చూపించాడని విమర్శించారు. కేసీఆర్ కిట్ , కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఆశపెట్టి..లక్ష రూపాయల చెక్కును కూడా నెలల తరబడి ఆపుతున్నారన్నారు. కేసీఆర్ రాకముందు ఇస్నాపూర్‌లో పవర్ హాలిడేస్ ఉండేవని, కేసీఆర్ వచ్చాక 24 గంటల కరెంట్ ఇవ్వడంతో.. ఇక్కడ పరిశ్రమల్లో ఓటీలు దొరికి సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కరెంట్ కోతలు మొదలయ్యాయని, ఫ్రీ బస్సు అని చెప్పి ఆటో వాళ్ళ పొట్ట కొట్టారని, మగోళ్లకు టికెట్ డబుల్ చేసి బాదపెడున్నారు. ఇస్నాపూర్ లో మీకు అందుబాటులో ఉండే వాళ్లకు, మీ భవిష్యత్తును బాగా చూసుకునే వాళ్లకు ఓటెయ్యాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

కోటి రూపాయలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. సీఎంకు హరీశ్‌రావు సంచలన సవాల్

Next Story