- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నరకంగా తార్నాక-లాలాపేట రహదారి
తార్నాక ఇప్పుడు ఆక్రమణలు, అడ్డగోలు పార్కింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

దిశ, సికింద్రాబాద్: హైదరాబాద్ నగరంలోనే అత్యంత కీలకమైన జంక్షన్‌లో ఒకటైన తార్నాక ఇప్పుడు అక్రమ ఆక్రమణలు, అడ్డగోలు పార్కింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటేనే సామాన్య వాహనదారులు వణికిపోతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన స్థానిక ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు చూపిస్తున్న వివక్ష, పక్షపాత వైఖరి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గల్లీల్లో గరీబోళ్లపై ప్రతాపం..
ఇటీవల పలువురు గల్లీల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. ట్రాఫిక్ పోలీసు లు తక్షణమే రంగంలోకి దిగారు. రోడ్డు పక్కన బండి పెట్టుకుని పొట్టకూటి కోసం వెతుక్కునే గరీబోళ్లను లక్ష్యంగా చేసుకుని, వారి సామగ్రిని, స్టీల్ బండ్లను బలవంతంగా వ్యాన్లలో వేసుకుని వెళ్లారు. గల్లీల్లో అంత వేగంగా 'యాక్షన్' తీసుకున్న పోలీసులు.. నిత్యం నగరంలోనే ప్రధాన కూడలిగా ఉంటూ, వేలాది మంది ప్రయాణించే తార్నాక చౌరస్తా మెయిన్ రోడ్డుపై జరుగుతున్న ఘోరమైన ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు సూటిగా నిలదీస్తున్నారు.
తాజా కిచెన్' కోసం యూటర్న్ బలి..
తార్నాక నుంచి లాలాపేట వెళ్లే మార్గంలో ఉన్న 'తాజా కిచెన్' హోటల్ దగ్గర ట్రాఫిక్ నిత్యం స్తంభించిపోతోంది. గతంలో ఇక్కడ యూటర్న్ ఉన్న సమయంలో వాహనాల రాకపోకలు చాలా సాఫీగా సాగేవి. కానీ, ఇ ప్పుడు ఆ యూటర్న్‌ను మూసివేయ డం వెనుక ట్రాఫిక్ పోలీసుల హస్తం ఉందనే సంచలన ఆరోపణలు వస్తున్నాయి. నడవడానికి వీల్లేకుండా ఫు ట్‌పాత్‌ను బైకులతో నింపేస్తున్నా, కా ర్లను రోడ్డుపై పెడుతున్నా పోలీసులు కళ్లు మూసుకొని కూర్చోవడం వెనుక ఉన్న అసలు మర్మమేంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
రాత్రి 9 దాటితే డెక్కన్ ప్లాజా..
తాజా కిచెన్‌కు కొద్ది దూరంలోనే ఉన్న 'డెక్కన్ ప్లాజా' వద్ద పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాత్రి 9 గంటలు దాటిందంటే చాలు, ఈ హోటల్ నిర్వాహకుల అక్రమాలు మొదలవుతాయి. కస్టమర్ల బైక్‌లను ఏకంగా ప్రధాన రహదారిపైకి వచ్చే లా, సగానికి పైగా రోడ్డును ఆక్రమించేలా పార్కింగ్ చేయిస్తున్నా రు. మరోవైపు తార్నాక చౌరస్తా దగ్గర ఉన్న యూటర్న్ కొందరు ఆటో డ్రైవర్లు అక్రమంగా 'ఆటో స్టాండ్ గా మార్చేశారు. ఒకవేళ ఇది అధికారిక ఆటో స్టాండ్ అయితే.. ఇక్కడ 'ఆటో స్టాండ్' అని ఒక బోర్డై నా పెట్టండి, లేదంటే అక్రమంగా రోడ్డును బ్లాక్ చేస్తున్న ఆటోలపై కఠిన చర్యలు తీసుకోండి అని వాహనదారులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- Tarnaka-Lalapet






