కరీంనగర్‌లో అర్థరాత్రి తుపాకులతో బీభత్సం.. కుటుంబ సభ్యులను కట్టేసి, చితకబాది భారీ దోపిడీ!

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-22 03:46:58  IST  )

కరీంనగర్‌లో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

కరీంనగర్‌లో అర్థరాత్రి తుపాకులతో బీభత్సం.. కుటుంబ సభ్యులను కట్టేసి, చితకబాది భారీ దోపిడీ!
X

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలో ఓ ఇంట్లో మాస్కులు ధరించిన దుండగులు ఇంటి యజమాని బయట లైట్ ఆఫ్ చేసి పడుకునేందుకు బయటకు రాగా వెనకవైపు నుంచి వచ్చి అరవకుండా నోరు మూసి ఇంట్లోకి చొరబడి తుపాకులు కత్తులతో కుటుంబ సభ్యులను కట్టేసి చితకబాదినట్టు సమాచారం. ఇంట్లో టీవీ సౌండ్ పెట్టి ఎవరికి అలికిడి అరుపులు వినపడకుండా చోరీకి పాల్పడిన దొంగలు 66 తులాల బంగారం, రూ.21లక్షల నగదు అపహరించినట్లు సమాచారం. వెలుతు వెలుతు ఇంటి క్రింద పార్క్ చేసిన రెండు ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో సంఘటన స్థలాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సందర్శించనున్నట్లు తెలుస్తుంది.

Next Story