- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయానక అగ్నిప్రమాదం: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది దుర్మరణం!
గుజరాత్‌లోని రామోల్‌లో బాణాసంచా కేంద్రంలో పేలుడు జరిగి 10 మంది మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ప్రమాదం గుజరాత్‌లోని రామోల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో అక్కడికక్కడే 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కాగా, ఈ ప్రమాదంలో అధికారులు నిర్లక్ష్యం కూడా బయటపడింది. ఎలాంటి సక్రమమైన లైసెన్స్ లేకపోవడంతో అధికారులు ఈ ఏడాది మార్చి 31నే సదరు బాణాసంచా ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అయితే అధికారుల సీల్‌ను పక్కనపెట్టి అక్రమంగా తయారీ కొనసాగించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.






