‘దిశ’ కథనానికి స్పందన.. డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులను తిరిగి రప్పించాలని ఎమ్మెల్యే అదేశం

by Jakkula.Mamatha |

నాగర్ కర్నూల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో "ఏజెన్సీలో బడి బంద్! "అనే ‘దిశ’ శీర్షిక కథనం బుధవారం ప్రచురితమైన విషయం తెలిసిందే.

‘దిశ’ కథనానికి స్పందన.. డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులను తిరిగి రప్పించాలని ఎమ్మెల్యే అదేశం
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో "ఏజెన్సీలో బడి బంద్! "అనే ‘దిశ’ శీర్షిక కథనం బుధవారం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి(దోమల పెంట ) గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పై గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మందికి పైగా విద్యార్థులు ఉండగా, ఒక ఉపాధ్యాయుడు దీర్ఘకాలిక సెలవులో ఉండడం, మరో ఉపాధ్యాయురాలు ఉదయం 11:30 గంటలకు పాఠశాలకు వచ్చి మధ్యాహ్నం 2:30 గంటలకే వెళ్లిపోవడం స్థానికుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) బాలకిషన్‌ను ప్రశ్నించి పరిస్థితిపై ఆరా తీశారు. దీనికి స్పందించిన ఎంఈఓ ఆ విషయం నా పరిధిలో లేదని ఆ ఉపాధ్యాయురాలు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో డిప్యూటేషన్ పై వెళ్లిందని ఎంఈఓ చెప్పినట్లు సమాచారం. అనంతరం ఎమ్మెల్యే డీఈఓ రమేష్ కు ఫోన్ చేసి వివరణ కోరేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.

డిప్యూటేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి..

ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడే విషయాన్ని ఎమ్మెల్యే డీఈఓతో ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రస్తుతం డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను తక్షణమే రద్దు చేసి, ప్రతి ఉపాధ్యాయుడు వారు పనిచేసే పాఠశాలలోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మారుమూల ప్రాంతాల విద్యార్థుల విద్యకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Next Story