- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజా హెగ్డేకు షాక్.. ఆ భామకు యాక్షన్ రోల్ ఇవ్వమన్న విజయ్.. హెచ్ వినోద్ షాకింగ్ కామెంట్స్
ఈ సినిమాలో విజయ్ గారి కూతురి పాత్ర కోసం శ్రీలీల, మమితల పేర్లను పరిశీలించగా.. అందరూ మమిత వైపే మొగ్గు చూపారని వివరించారు.

దిశ, సినిమా: తమిళ నాడు సీఎం, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వాస్తవానికి సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల హోరు పెంచిన దర్శకుడు హెచ్ వినోద్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారని చెప్పారు. కథా రీత్యా ముందుగా ఆమె కోసం ఎన్నో సీన్స్ అనుకున్నప్పటికీ, సినిమా నిడివి ఎక్కువైపోతుందనే కారణంతో కొన్ని సీన్స్ షూట్ చేయలేకపోయామని, చిత్రీకరించిన మరికొన్ని సీన్లను కూడా ఎడిటింగ్‌లో కత్తిరించాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ విషయంలో పూజా హెగ్డేకు క్షమాపణలు కూడా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక యంగ్ హీరోయిన్ మమితా బైజు గురించి మాట్లాడుతూ.. ‘ప్రేమలు’ సినిమా చూసిన తర్వాత ఆమె నటన తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఈ సినిమాలో విజయ్ గారి కూతురి పాత్ర కోసం శ్రీలీల, మమితల పేర్లను పరిశీలించగా.. అందరూ మమిత వైపే మొగ్గు చూపారని వివరించారు. మమిత ప్రవర్తన, ఆమె ఎనర్జీ చూస్తుంటే అచ్చం లేడీ విజయ్ లాగే అనిపిస్తుందని ప్రశంసించారు. 'డ్యూడ్' సినిమాలో ఆమె చేసిన పాత్ర స్వభావం చూస్తే వేరే హీరోయిన్ అయితే ఆ రోల్ రిజెక్ట్ చేసేదేమోనని అన్నారు. మమిత నటన నచ్చి, ఈ సినిమాలో ఆమెకు యాక్షన్ సీన్స్‌లో మరింత అవకాశం ఇవ్వాలని స్వయంగా విజయ్ గారే సూచించారని హెచ్ వినోద్ వెల్లడించారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఇక వరుస ఫ్లాపులతో సతమతమతమతువున్న పూజా హెగ్డేకు ఈ సినిమా కూడా కలిసిరాదని అభిప్రాయపడుతున్నారు.






