సీజేపీ నిరసనకు పెరుగుతున్న సపోర్ట్.. భారీగా ఆహారం, నీరు సప్లై చేస్తున్న మద్దతుదారులు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-22 06:37:45  IST  )

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేస్తున్న నిర‌స‌న‌కు స‌పోర్ట్ పెరుగుతోంది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో మొద‌లైన ఈ ఆందోళ‌న‌లో విద్యార్థుల‌తో పాటు వివిధ రాజ‌కీయ పార్టీల నుండి స‌పోర్ట్ ల‌భిస్తోంది.

సీజేపీ నిరసనకు పెరుగుతున్న సపోర్ట్.. భారీగా ఆహారం, నీరు సప్లై చేస్తున్న మద్దతుదారులు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేస్తున్న నిర‌స‌న‌కు స‌పోర్ట్ పెరుగుతోంది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో మొద‌లైన ఈ ఆందోళ‌న‌లో విద్యార్థుల‌తో పాటు వివిధ రాజ‌కీయ పార్టీల నుండి స‌పోర్ట్ ల‌భిస్తోంది. మ‌రోవైపు విద్యార్థులు, సీజేపీ నిర‌స‌న‌కు మ‌ద్ద‌తిస్తూ గుర్తు తెలియ‌ని దాతలు భారీగా ఆహారాన్ని పంపిస్తున్నారు. నిర‌స‌న‌కారులు రాత్రింభ‌వ‌ళ్లు ఆందోళ‌న కొన‌సాగిస్తుండ‌గా అక్క‌డకు కొంద‌రు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ యాప్స్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. దీంతో అవ‌స‌రానికి మించి అక్క‌డకు ఆహారం చేరుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఆన్ లైప్ యాప్స్ ద్వారా ఆహారంతో పాటు నీటిని సైతం స‌ప్లై చేస్తున్నారు. మ‌రోవైపు కేంద్రం ఒక అడుగు దిగి చ‌ర్చ‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే సోన‌మ్ వాంగ్ చుక్ చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి వెళ్లి కేంద్ర‌మంత్రులు జేపీ న‌డ్డా, జితేంద్ర‌సింగ్ మాట్లాడారు. కేంద్రం చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. నిన్న ప్ర‌ధాని మోడీ నివాసం ముందు కాంగ్రెస్ ఆందోళ‌న చేప‌ట్ట‌గా ఆయ‌న‌తోనూ మాట్లాడారు. అయితే కేంద్రం మాత్రం నీట్ పేప‌ర్ లీక్ కు బాధ్య‌త వ‌హిస్తూ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయ‌డాన్ని అంగీక‌రించ‌డంలేద‌ని ప‌రిస్థితులు చూస్తే అర్థం అవుతోంది.

ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది..కేంద్రానికి సీజేపీ జాతీయ ప్రతినిధి వార్నింగ్

మోడీని కాల్చిపరేస్తా.. సీజేపీ నిరసనలో బూతులతో రెచ్చిపోయిన యువకుడు

Next Story