- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీని కాల్చిపరేస్తా.. సీజేపీ నిరసనలో బూతులతో రెచ్చిపోయిన యువకుడు
ఢిల్లీలో సీజేపీ ఆందోళన జరుగుతున్న సమయంలో ఓ యువకుడు బూతులతో రెచ్చిపోయాడు. ఏకంగా ప్రధాని మోడీనే బూతులు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో సీజేపీ ఆందోళన జరుగుతున్న సమయంలో ఓ యువకుడు బూతులతో రెచ్చిపోయాడు. ఏకంగా ప్రధాని మోడీనే బూతులు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయాడు. మోడీ నువ్వు నాకు దొరికితే వదిలిపెట్టను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిన్న కాల్చి చంపేస్తా అంటూ హెచ్చరించాడు. అంతేకాకుండా రాయలేని భాషలో బూతులు తిట్టాడు. మోడీ తల్లిని కూడా దూషించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన శాంతియుతంగా చేయాలని ఇలా బూతులు తిట్టడంవల్ల అసలైన విద్యార్థులు నష్టపోతారని మండిపడుతున్నారు.
మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే ఇప్పటికే తాము దేశభక్తులం అని శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నామని ప్రకటంచాడు. జంతర్ మంతర్ వద్ద తప్ప ఢిల్లీలో మరెక్కడా తాము నిరసన వ్యక్తం చేయడంలేదని అన్నాడు. ఎవరైనా సీజేపీ పేరుతో ఘర్షణలకు పాల్పడితే సీజేపీకి వారితో సంబంధం లేదని స్పష్టం చేశాడు. నిన్న పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేసినా తాము మాత్రం ఎలాంటి ఎదురుదాడి చేయలేదని శాంతియుతంగానే ఉన్నామని చెప్పాడు.






