- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిగ్ వర్కర్లు, డ్రైవర్లను అగ్రిగేటర్ల శ్రమదోపిడీపై జోక్యం చేసుకోండి.. ప్రభుత్వానికి కవిత డిమాండ్
గిగ్ వర్కర్లు, డ్రైవర్లను అగ్రిగేటర్లు వేధిస్తున్నారని కవిత ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పని చేస్తున్న లక్షలాది మంది వర్కర్లు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రోజంతా కష్టపడినా వారి ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని, మూడేళ్లుగా రేట్లు పెంచాలని వాళ్లు అడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అగ్రిగేటర్ సంస్థలు కమీషన్ల కోత విధిస్తూ, ఛార్జీలను అన్యాయంగా నియంత్రిస్తున్నాయని, దీనివల్ల డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నార ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అగ్రిగేటర్స్ సంస్థలతో మాట్లాడి గిగ్ వర్కర్లకు, క్యాబ్ డ్రైవర్లకు ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు.
గిగ్ వర్కర్స్ పక్షాన నిలబడండి:
రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల పక్షాన నిలబడాలని కవిత డిమాండ్ చేశారు. రేట్ల విషయంలో అగ్రిగేటర్లు పట్టి పీడిస్తున్నారని ఈ విషయంలో గిగ్ వర్కర్లు గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గిగ్ వర్కర్లు అంతా ఇవాళ మధ్యాహ్నం వరక్ బ్రేక్ డౌన్ చేస్తున్నారని ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండా గిగ్ వర్కర్లు, ఆటో క్యాబ్ డ్రైవర్ల పక్షాన ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని హెచ్చరించారు. గిగ్ వర్కర్ల ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందన్నారు.






