ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిన సురభి.. రెండు క్రేజీ చిత్రాల్లో ఛాన్స్

by Pulgam srinivas |   (  Updated:2026-07-22 07:17:39  IST  )

రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో అవకాశాలు దక్కించుకున్న సురభి మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చిన సురభి.. రెండు క్రేజీ చిత్రాల్లో ఛాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సురభి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ చిత్ర విజయంతో పాటు తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకోవడంతో వరుసగా పలు తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో క్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

దీంతో సురభికి టాలీవుడ్‌లో అవకాశాలు రావడం కష్టమేననే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా పరిస్థితి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో అవకాశాలు దక్కించుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సురభి, నరేష్ హీరోగా తెరకెక్కుతున్న 'రంభ ఊర్వశి మేనక' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా, దర్శకుడు వేణు తెరకెక్కిస్తున్న 'ఎల్లమ్మ' చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సురభి కథానాయికగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో అవకాశాలు దక్కించుకుంటున్న సురభి, ఈ సినిమాలతో విజయాలను అందుకుంటే టాలీవుడ్‌లో మరోసారి బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అది నాకు దక్కిన పెద్ద గౌరవంగా భావిస్తున్నా.. ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది: అవికా గోర్

Next Story