జంతర్ మంతర్‌లో ఇష్టమొచ్చిన నినాదాలు చేయోద్దు.. ఈ నాలుగు నినాదాలే చేయాలి: సీజేపీ

by Malleboina Mahesh |

జంతర్ మంతర్ నిరసనలో వ్యతిరేక నినాదాలు సహించేది లేదు; నాలుగు ప్రధాన నినాదాలకే కట్టుబడి ఉండాలని CJP ప్రతినిధి అశుతోష్ రంకా ఆదేశం.

జంతర్ మంతర్‌లో ఇష్టమొచ్చిన నినాదాలు చేయోద్దు.. ఈ నాలుగు నినాదాలే చేయాలి: సీజేపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న విద్యార్థుల ఆందోళనలో భాగంగా వివిధ సంఘాల నేతలు చేస్తున్న నినాదాలు తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. దీంతో అప్రమత్తం అయిన సీజేపీ నేతలు ఎలాంటి దేశ వ్యతిరేక, వివాదాస్పద నినాదాలు, వ్యాఖ్యలకు తావివ్వకూడదని అధికార ప్రతినిధి అశుతోష్ రంకా నిరసనకారులకు స్పష్టమైన పిలుపునిచ్చారు. తమ శాంతియుత పోరాటం పై ప్రతికూల ముద్ర (Negative Narrative) వేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందువల్ల ఆందోళనకారులు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.

నిరసన ప్రదర్శన లో పాల్గొంటున్న వారంతా కేవలం నాలుగు ప్రధాన నినాదాలకే కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ‘భారత్ మాతా కీ జై’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘జై భీమ్’, ‘ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో’ (ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి) అనే నినాదాలు మాత్రమే చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇతర ప్రతికూల, అవాంఛనీయ నినాదాలను తాము సహించేది లేదని, లక్ష్యసాధన దిశగా క్రమశిక్షణతో పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా నిరసన కారులకు వెల్లడించారు.

Next Story