- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ ప్రయోజనాల కోసమే నీట్ పేపర్ లీక్
బీజేపీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై నీట్ పేపర్ లీక్ చేసిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆరోపించారు.

దిశ, ఆసిఫాబాద్ : బీజేపీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై నీట్ పేపర్ లీక్ చేసిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆరోపించారు. రాహుల్ గాంధీ విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళకు నల్ల గంతలు కట్టి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని పూర్తిగా దెబ్బతిందన్నారు. విద్యాసంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ కాషాయికరణ దశగా అడుగులు వేస్తోందన్నారు. దీని ఫలితంగా నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం దేశం యువత భవిష్యత్తు తో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. న్యాయం కోసం నిరసనకు దిగిన వామపక్ష నాయకులు, విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసి కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, నీట్ పేపర్ లీక్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తదితరులు ఉన్నారు.






