రాహుల్ సోదరి చదువుకు పూర్తి బాధ్యత మాదే: ఎమ్మెల్యే సంజయ్

by Kodari Anjali |

ఇటీవల మృతి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు.

రాహుల్ సోదరి చదువుకు పూర్తి బాధ్యత మాదే: ఎమ్మెల్యే సంజయ్
X

దిశ, కోరుట్ల రూరల్: ఇటీవల మృతి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. రాహుల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబానికి తక్షణ అవసరాల కోసం రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని, అలాగే రాహుల్ సోదరి విద్యాభ్యాసానికి అవసరమయ్యే పూర్తి సహాయాన్ని అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఆమె ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా తన వంతు బాధ్యత తీసుకుని అన్ని విధాలుగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, రాహుల్ కుటుంబానికి భవిష్యత్తులో అవసరమైన ప్రభుత్వ పరమైన సహాయాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈయన వెంట నాయకులు దీకొండ రాజ నర్సయ్య, పిడుగు సందయ్య, గిన్నెల అనంతస్వామి, సిరిపురం గంగాధర్, గాజెంగి లక్ష్మి పతి తదితరులు ఉన్నారు.

Next Story