వేములవాడ KDCC బ్యాంక్ నుండి డ్రా చేసిన రూ. 3 లక్షలు స్వాహా

by Kodari Anjali |

వేములవాడ పట్టణంలో అనూహ్య సంఘటన జరిగింది.

వేములవాడ KDCC బ్యాంక్ నుండి డ్రా చేసిన రూ. 3 లక్షలు స్వాహా
X

దిశ, వేములవాడ టౌన్: వేములవాడ పట్టణంలో అనూహ్య సంఘటన జరిగింది. KDCC బ్యాంక్ డ్రా చేసిన మూడు లక్షల రూపాయల నగదు మాయం అయ్యింది. వివరాల్లోకెళ్తే.. నాగరాజు అనే వ్యక్తి బ్యాంక్ నుండి డ్రా చేసి బండిలో పెట్టొకొని ఇంటికి పోయాడు. బయటకు వచ్చి చూసేసరికి బండిలో ఉన్న డబ్బు మాయం అయ్యింది. డ్రా చేసిన సమయంలో చూసిన వ్యక్తులే వెంబడించి డబ్బులు దొంగిలించాడు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story