రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన జపాన్ రైడర్!

by velandi.Saikiran |

జపాన్‌కు చెందిన ట్రయల్స్ రైడర్ టొమోమి నిషికుబో రెండు గిన్నిస్ రికార్డులు సాధించారు.

రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన జపాన్ రైడర్!
X

దిశ‌, వెబ్ డెస్క్: జపాన్ కు సంబంధించిన సైక్లిస్టు టొమోమి నిషికుబో అరుదైన విన్యాసంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒలంపిక్ స్కీ జంప్ పై సైకిల్ తో అద్భుతమైన స్టంట్ చేసి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. ముందు చక్రంపై బ్యాలెన్స్ చేస్తూ రివర్స్ లో సైకిలింగ్ చేశాడు. దాదాపు 136.6 మీటర్లు సైకిల్ తొక్కి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 37.5 డిగ్రీల నిటారైన వాలుపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈ సాహసానికి తెర లేపాడు. ఈ క్రమంలోనే ముందు ఉన్న‌ వీల్ బ్యాలెన్స్ చేస్తూ రివర్స్ లో ప్రయాణించిన తొలి వ్యక్తిగా హిస్టరీ క్రియేట్ చేశాడు టొమోమి నిషికుబో. జపాన్ లోని హకుబా స్కీ జంప్ వేదికగా జరిగిన ఈ విన్యాసం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై క్రీడా ప్రియులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. క్లిక్

Next Story