- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
108 అంబులెన్స్‌లోనే ప్రసవం
by Ratna Kumari |
సింగారం గ్రామానికి చెందిన మడవి జోగి బుధవారం ప్రసవ వేదనలు రావడంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మగ శిశువుకు జన్మనిచ్చింది.

X
దిశ, ఆళ్లపల్లి : మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామపంచాయతీ సింగారం గ్రామానికి చెందిన మడవి జోగి బుధవారం ప్రసవ వేదనలు రావడంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ నొప్పులు తీవ్రం కావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమై, సురక్షితంగా అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. అనంతరం తల్లీబిడ్డలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తరుణ్ వైద్య పరీక్షలు నిర్వహించగా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, బాధిత కుటుంబం రెండు రోజుల క్రితమే ఛత్తీస్‌గఢ్ నుంచి సింగారం గ్రామానికి వచ్చి స్థిరపడినట్లు తెలిసింది. సకాలంలో స్పందించి సురక్షిత ప్రసవం నిర్వహించిన 108 అంబులెన్స్ సిబ్బంది సేవలను గ్రామస్తులు అభినందించారు.
Next Story






