- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీకొన్న కారు.. యువకుడు దుర్మరణం
ముందు వెళుతున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, శంషాబాద్: ముందు వెళుతున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని ఆర్‌బీ నగర్‌కు చెందిన ఎస్. అజయ్ కుమార్ (31) డ్రైవర్ గా పని చేస్తుండే వాడు. అతడు స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు కొత్తూర్ మండలం గూడూరు గ్రామానికి కారులో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బీకే తండాకు చెందిన కేతావత్ ప్రసన్న కుమార్ అలియాస్ చరణ్ నడుపుతున్న స్విఫ్ట్ కారు (AP29 BP 0081)లో బుధవారం తెల్లవారుజామున వస్తుండగా సుమారు 5:10 గంటలకు అతివేగంతో వెళ్లి ముందుగా వెళ్తున్న లారీ (TN30 BK 7830)ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీటులో కూర్చున్న అజయ్ కుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. కారు నడుపుతున్న ప్రసన్న కుమార్ తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో తొండుపల్లిలోని లిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి తల్లి ఎస్. పద్మావతి ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






