కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలపై దాడి చేయడం హేయమైన చర్య చర్య

by Taduka Kalyani |

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలపై లాఠీచార్జ్ జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలపై దాడి చేయడం హేయమైన చర్య చర్య
X

దిశ, ఉట్నూర్ : విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలపై లాఠీచార్జ్ జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విమర్శించారు. బుధవారం ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులపై దాడులు జరగడం, వారిని ఇబ్బందులకు గురిచేయడం సరైన చర్య కాదన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సముచితంగా స్పందించకపోవడం విచారకరమని బొజ్జు పటేల్ అన్నారు. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి, కాంగ్రెస్ జాతీయ నాయకులపై జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సంబంధిత కేంద్ర మంత్రులు బాధ్యత స్వీకరించి రాజీనామా చేయాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తలెత్తే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు నిసార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, నాయకులు తిరుపతి, భాగ్యలక్ష్మి, జాదవ్ శ్రీనివాస్, ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story