కేంద్రం హామీ ఇస్తే దీక్ష తక్షణమే విరమిస్తా.. సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ

by Kema Shiva Kumar |

నిరాహార దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ విడుదల చేశారు.

కేంద్రం హామీ ఇస్తే దీక్ష తక్షణమే విరమిస్తా.. సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) పేపర్ లీకేజీ అక్రమాలపై నిరాహార దీక్షలో ఉన్న ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో తనను పరామర్శించి దీక్ష విరమించాలని కోరిన సందర్భంగా.. పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించడం, విద్యాశాఖ మంత్రి రాజీనామాతో సహా జవాబుదారీతనంపై పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చ జరపడాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రులు హామీ ఇచ్చారని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.

యువతపై ఎలాంటి కేసులు పెట్టొద్దు..

ఇక జూలై 20న జరిగిన ‘సంసద్ చలో’ మార్చ్ చాలా ప్రశాంతంగా జరిగిందని, పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు ఎంతో సహనంతో వ్యవహరించారని వాంగ్‌చుక్ గుర్తుచేశారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువ నిరసనకారులపై ఎటువంటి కేసులు, వేధింపులు లేదా ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 65 మంది పార్లమెంట్ సభ్యులు తనకు లేఖ రాశారని, కొందరు నేరుగా వచ్చి కలిసి దీక్ష విరమించాలని కోరారని తెలిపారు. తాను బ్రతకాలనుకుంటున్నానని.. తిరిగి విద్యార్థుల వద్దకు వెళ్లాలని భావిస్తున్నానని అన్నారు. అయితే ఈ ఉద్యమానికి మూలమైన యువత ప్రయోజనాలను పక్కనబెట్టి తాను ఆ పని చేయలేనని వాంగ్ చుక్ చెప్పుకొచ్చారు.

హామీ ఇవ్వకపోతే దీక్ష కొనసాగింపు..

ప్రభుత్వం తన విజ్ఞప్తినే కాకుండా లక్షలాది మంది భారతీయ యువత ఆకాంక్షలను ఆలకించిందని భావిస్తేనే దీక్ష విరమిస్తానని, లేకపోతే తన ఆమరణ నిరాహార దీక్షను నిరవధికంగా కొనసాగించాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల బలప్రయోగాన్ని ఇకపై ఉపయోగించరని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. మన ప్రజాస్వామ్య భవిష్యత్తు అనేది తనతో ఏకీభవించే వారిని ప్రభుత్వం ఎలా చూస్తుందనే దానిపై ఆధారపడి ఉండదని అన్నారు. ధైర్యం, ఆశ, విశ్వాసంతో మాట్లాడే యువ పౌరులను ఎలా చూస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుం సోనమ్ వాంగ్‌చుక్ తన లేఖల ప్రస్తావించారు.





Next Story