రాజధాని రైతులకు తీపికబురు.. ప్లాట్ల కేటాయింపుపై మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-22 12:18:51  IST  )

రాజధాని రైతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. అమరావతి అభివృద్ధికి భూసేకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే భూమి సేకరించిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....

రాజధాని రైతులకు తీపికబురు.. ప్లాట్ల కేటాయింపుపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని రైతుల(Capital Farmers)కు ప్రభుత్వం తీపికబురు అందించింది. అమరావతి(Amaravati) అభివృద్ధికి భూసేకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే భూమి సేకరించిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు(Returnable plots) ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రైతులకు వీలైన చోటే ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి నారాయణ(Minister Narayana) క్లారిటీ ఇచ్చారు. రాజధానిలో రైతులకు ప్లాట్లు కేటాయించేందుకు రెండు, మూడు డిజైన్లు సిద్ధం చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడే ప్లాట్లు ఇస్తామని చెప్పారు, ఈ విషయాన్ని గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు చెబుతున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

కాగా రాజధాని అభివృద్ధి పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. అయితే అభివృద్ధిని మరింత విస్తరించేందుకు రెండో విడత భూసేరణ చేపడుతోంది. అయితే రైతులకు సరైన ప్లాట్ల ఇవ్వడంలేదనే విమర్శలు వినిపిస్తోంది. దీంతో రైతులకు అనుకూలమైన ప్లాట్లనే కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి నారాయణ ప్రకటన చేశారు.

Next Story