- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ.. స్వయంగా జగన్ కీలక ప్రకటన
by Vemula.Srinu Prasad |
పొగాకు రైతులకు మద్దతుగా వైసీపీ ఆందోళనలు చేపడుతుందని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలో పొగాకు రైతులతో సమావేశమైన ఆయన సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: పొగాకు రైతులకు మద్దతుగా వైసీపీ ఆందోళనలు చేపడుతుందని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలో పొగాకు రైతులతో సమావేశమైన ఆయన సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. పొగాకు మద్దతు ధర కోసం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం జంగారెడ్డి, కందుకూరులో పర్యటిస్తానని స్పష్టం చేశారు. మద్దతు ధర 200కు తగ్గకూడదని చంద్రబాబు చెప్పినా రేట్స్ పడిపోయాయని, వ్యాపారులు పట్టించుకోదని ఎద్దేవా చేశారు. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకూ ఏ కంపెనీ లైసెన్సునూ సస్పెండ్ చేయలేదని మండిపడ్డారు. కనీసం ఒక్క వ్యాపారినీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదని వైఎస్ జగన్ విమర్శించారు.
Next Story






