- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా వ్యక్తిగత సాధికరతకు శక్తివంతమైన సాధనం: హెచ్ఆర్సీ చైర్మన్
విద్య వ్యక్తిగత సాధికారతకు, సామాజిక పరివర్తనకు అత్యంత శక్తివంతమైన సాధనమని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్నారు .

దిశ, హైదరాబాద్ బ్యూరో: విద్య వ్యక్తిగత సాధికారతకు, సామాజిక పరివర్తనకు అత్యంత శక్తివంతమైన సాధనమని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్నారు. ఈ మేరకు బుధవారం వైష్ణోయి గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ నాయకత్వంలో నిర్వహించిన వార్షిక స్కాలర్షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం 2026–27 విద్యా సంవత్సరానికి గాను 187 మంది అర్హులైన విద్యార్థులకు రూ.74 లక్షల విలువైన స్కాలర్ షిప్ లను అందజేసి వైఆర్పీ ఫౌండేషన్ సేవలను అభినందించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తూ విద్యాభివృద్ధికి ఫౌండేషన్ అందిస్తున్న నిరంతర సేవలను ప్రశంసించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ అర్హత కలిగిన విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా చూడాలనే ఫౌండేషన్ సంకల్పాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు, . రిటైర్డ్ ఐఏఎస్ ఎం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.






