- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'తపస్ ఛలో హైదరాబాద్' మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ..
ఉద్యమ కార్యాచరణలో భాగంగా 'ఛలో హైదరాబాద్.. మహా ధర్నా' పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు.

దిశ, గంగాధర: విద్యా రంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చూపుతున్న అలసత్వానికి, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా 'తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్)' రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా 'ఛలో హైదరాబాద్... మహా ధర్నా' పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. గంగాధర మండల విద్యాధికారి డాక్టర్ ఎలిగేటి మల్లికార్జున్, గంగాధర కాంప్లెక్స్ హెచ్‌ఎం జి. అనితా కుమారి లచే ఈ పోస్టర్‌ను ఆవిష్కరించినట్లు తపస్ మండల శాఖ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షుడు బోయిన శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్‌ను వర్తింపజేయాలని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన 'మహా ధర్నా' కార్యక్రమానికి గంగాధర మండలం నుండి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల నాయకులు టి. సంపత్ రెడ్డి, లక్ష్మణ్, ఓ.పి. రఘురామ్‌లతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






