ఫిట్స్ తో యువకుడు మృతి

by Taduka Kalyani |

అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

ఫిట్స్ తో యువకుడు మృతి
X

దిశ, సంగారెడ్డి : అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంది లక్ష్మీ నగర్ కాలనీలో నివాసముంటున్న మొహమ్మద్ మహబూబ్ (26) స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతడికి భార్య, సంవత్సరంనర వయస్సు కూతురు ఉన్నారు. కాగా అతను ఎప్పటినుంచో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఈ నెల 21న అతను రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కంది వైన్స్ వెనుక ఉన్న పొలాల్లో ఈ రోజు ఉదయం ఎవరో వ్యక్తి చనిపోయి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అది మెహబూబ్ మృతదేహంగా గుర్తించారు. అయితే ఫిట్స్ రావడంతోనే అతడు పంట పొలాల్లో పడి మృతి చెందాడని ఎస్ఐ స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story