- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ.. ఘటనపై భూమన ఫైర్
తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఫైర్ అయ్యారు. ...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో ఆంజనేయ స్వామి విగ్రహం(Statue of Lord Anjaneya) చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy) ఫైర్ అయ్యారు. తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుడిని అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చోరీ చేసిన దొంగను టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించారని, అయితే పిచ్చివాడుగా ముద్ర వేసే కుట్ర జరుగుతోందని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. తిరుమల కొండపై ప్రతినిత్యం ఏదో ఒక ఘోరం, అపచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ అవడమంటే కోట్లాది మంది భక్తులు మనోభావాలకు చెందిన అంశమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని చెప్పారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.






