- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Housing Market: కోటి దాటిన ఇళ్లకు భారీ డిమాండ్
తాజా జేఎల్ఎల్ నివేదిక ప్రకారం, జనవరి-జూన్ మధ్య దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో మొత్తం 1,38,382 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 3 శాతం అధికం.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ హౌసింగ్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాల ధోరణి చాలా వేగంగా మారుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రధానంగా కనిపించిన మార్పు చౌక, మధ్యతరగతి ఇళ్ల కంటే కోటి రూపాయలకు పైబడిన ప్రీమియం ఇళ్లపై ఆసక్తి గణనీయంగా పెరగడమేనని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా జేఎల్ఎల్ నివేదిక ప్రకారం, జనవరి-జూన్ మధ్య దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో మొత్తం 1,38,382 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 3 శాతం అధికం. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా 9 శాతం పెరిగి 1,68,507 యూనిట్లకు చేరింది. ముఖ్యంగా రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు ఏకంగా 58 శాతం పెరిగి 51,231 యూనిట్లకు చేరాయి. ఫలితంగా మొత్తం అమ్మకాలలో రూ.1 కోటి పైబడిన ఇళ్ల వాటా 62 శాతం నుంచి 71 శాతానికి పెరిగింది. మరోవైపు రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు 32 శాతం తగ్గగా, రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 20 శాతం క్షీణించాయి. దీంతో రూ.1 కోటి లోపు ఇళ్ల మార్కెట్ వాటా 39% నుంచి 28%కు పడిపోయింది. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో 35,017 యూనిట్ల అమ్మకాలతో 16 శాతం వృద్ధి నమోదైంది. చెన్నై 27 శాతం వృద్ధితో అత్యంత వేగంగా పెరిగిన మార్కెట్‌గా నిలవగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 7 శాతం పెరిగాయి. అయితే పుణె, హైదరాబాద్, ముంబై, కోల్‌కతాల్లో అమ్మకాలు క్షీణించాయి.






