రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి

by Ratna Kumari |

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ రాస్తారోకో నిర్వహించారు.

రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి
X

దిశ, మణుగూరు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ రాస్తారోకో నిర్వహించారు. ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును నొక్కివేసే ప్రయత్నం చేస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు.

దేశంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని పేర్కొంటూ, విభిన్న అభిప్రాయాలను అణచివేయడం, ప్రతిపక్ష నాయకులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు. రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సెంటర్ వద్ద జరిగిన రాస్తారోకో కారణంగా కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మణుగూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్రం రవి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, లంక మల్లారం సర్పంచ్ పూనెం రమేష్, సమితి సింగారం సర్పంచ్ మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, కూచిపూడి బాబు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు తరుణ్ రెడ్డి, ఆరిఫ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొని ఆందోళనకు సంఘీభావం తెలిపారు.

Next Story