భార‌త జ‌ట్టులోకి నో ఎంట్రీ..కుల్దీప్ యాద‌వ్ కీల‌క నిర్ణ‌యం!

by velandi.Saikiran |

భార‌త జ‌ట్టును కాద‌ని కంట్రీ క్రికెట్ ఆడేందుకు కుల్దీప్ యాద‌వ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు.

భార‌త జ‌ట్టులోకి నో ఎంట్రీ..కుల్దీప్ యాద‌వ్ కీల‌క నిర్ణ‌యం!
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత జట్టులో అంతంత మాత్రమే అవకాశాలు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కంట్రీ క్రికెట్ ఆడేందుకుగాను అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ లోని ప్రతిష్టాత్మక యార్క్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్ర‌కారం, యార్క్‌షైర్ త‌ర‌ఫున‌ మొత్తం ఎనిమిది మ్యాచ్ లు ఆడనున్నాడు కుల్దీప్ యాదవ్. జూలై 24వ తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు జరిగే ఐదు వన్డే కప్ మ్యాచ్ ల‌లో భాగం కానున్నారు.

ఆ తర్వాత ఆగస్టులో శ్రీలంకతో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. ఈ టోర్నమెంట్ ముగిసిన వెంటనే సెప్టెంబర్ లో తిరిగి ఇంగ్లాండ్ వెళ్తాడు కుల్దీప్ యాదవ్. ఈ సందర్భంగా యార్క్‌షైర్ తరుఫున మిగిలిన మూడు కౌంటీ ఛాంపియన్ షిప్ మ్యాచులు ఆడనున్నాడు. జూలై 24వ తేదీన నెత్ వేదికగా గ్లామెర్గాన్‌ జట్టుతో జరగబోయే 50 ఓవర్ల మ్యాచ్ తో తన కౌంటీ అరంగేట్రం చేయనున్నాడు కుల్దీప్ యాదవ్. కాగా ఇంగ్లాండ్ తో మొన్న వన్డే సిరీస్ జరిగిన నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ ను పక్కకు పెట్టాడు గంభీర్. అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

Next Story