- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీజేపీ ఆందోళనలో నిహాంగ్ సిక్కులు.. హెచ్చరికల వీడియో వైరల్
సీజేపీ చలో పార్లమెంట్ నిరసనలో నిహంగ్ సిక్కుల ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్‍గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విద్యార్థులు చేపట్టిన 'చలో పార్లమెంట్' ఆందోళన రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. మొన్న విద్యార్థులపై లాఠీ చార్జి జరిగినా జంతర్ మంతర్ వద్ద యువత ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన ఆగదని ఇప్పటికే సీజేపీ స్పష్టం చేసింది. విద్యార్థులు చేపట్టిన నిరసనకు క్రమంగా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తుండగా అకస్మాత్తుగా 'నిహంగ్' సిక్కులు జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చనీయాశంగా మారింది.
ఎవరినీ వదలం:
జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలో ఒక నిహంగ్ సిక్కు యువకుడు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. మేము గనుక దాడులు ప్రారంభించి కొట్టడం మొదలుపెడితే ప్రతి ఒక్కరి శరీరాలు గాయాలతో నిండిపోతాయని పోలీసులైనా మరొకరు అయినా సరే ఎవరినీ వదిలిపెట్టేది లేదు అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దీంతోవిద్యార్థుల నిరసనకు, నిహంగ్‌లకు సంబంధం ఏమిటి? అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.






