వైసీపీలోకి ఒంగోలు నేతలు.. జగన్ సమక్షంలో చేరికలు

by Vemula.Srinu Prasad |

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒంగోలు కాంగ్రెస్ నేతలు చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ నేత డి.సతీష్‌బాబు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు...

వైసీపీలోకి ఒంగోలు నేతలు.. జగన్ సమక్షంలో చేరికలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒంగోలు కాంగ్రెస్ నేతలు చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ నేత డి.సతీష్‌బాబు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జగన్‌ను టి.నాగలక్ష్మి, సతీష్‌బాబు కలిశారు. అనంతరం పార్టీలో చేరారు. ఒంగోలు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని తెలిపారు.

కాగా ఒంగోలు వైసీపీలో గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పని చేశారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి పవన్ కల్యాణ్ జనసేనలో చేరారు. దీంతో ఒంగోలు వైసీపీలో బలమైన నాయకులు లేరనే ప్రచారం జరిగింది. అయితే పార్టీ అధినేత జగన్ ఒంగోలు నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టారు. దీంతో కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి క్యూ కట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గత వైభవం వస్తోందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story