- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్ హోస్ట్‌గా గంగూలీ.. కోట్లల్లో రెమ్యునరేషన్!
బిగ్‌బాస్ హోస్ట్‌గా గంగూలీ వ్యవహరించనున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన కెరీర్ లో ఎన్నో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఐపీఎల్ లో పలు జట్లకు మెంటార్ గా కూడా వ్యవహరించారు. అలాంటి సౌరవ్ గంగూలీ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ వైరల్ కాగా... దీనిపై మరో గాసిప్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ రియాలిటీ షోను సినీ నటులే హోస్ట్ చేస్తుండగా.... బెంగాలీలో మాత్రం ఆసక్తికరంగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ హోస్ట్ చేస్తున్నారు. ఇందు కోసం ఏకంగా రూ.125 కోట్ల రెమ్యూనరేషన్ సౌరవ్ గంగూలీ తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత బెంగాలీలో మూడో సీజన్ రానుంది. సెప్టెంబర్ లో ఈ షో మొదలుకానుండగా... ఇటీవల ప్రోమో కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు సౌరవ్ గంగూలీ తీసుకునే రెమ్యూనరేషన్ పైన హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.






