Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |

స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి.

Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. దీంతో సెన్సెక్స్ 715.06 పాయింట్లు పడిపోయి 76,755 వద్ద ముగియగా, నిఫ్టీ 191.45 పాయింట్లు క్షీణించి 23,996 వద్ద ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. రియల్టీ, మీడియా, ఐటీ రంగాలు అత్యధికంగా పడిపోగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా రంగాలు కూడా బలహీనంగా కనిపించాయి. ఈ నష్టాలతో మదుపర్లు ఒక్కరోజులో సుమారు రూ.4.24 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఫలితంగా బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ.484.29 లక్షల కోట్ల నుంచి రూ.480.05 లక్షల కోట్లకు పడిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95 డాలర్లకు పైగా చేరడం, రూపాయి బలహీనపడటం, అమెరికా దిగుమతి జెనరిక్ ఔషధాలపై ప్రతిపాదిత సుంకాల పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఎక్కువ ప్రభావితం చేశాయని నిపుణులు పేర్కొన్నారు.

Next Story