- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Lalit Modi: లలిత్ మోదీకి బిగ్ రిలీఫ్.. ఈడీ అభియెగాలను కొట్టేసిన ట్రిబ్యునల్
16 ఏళ్ల తర్వాత ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) త్వరలోనే స్వదేశానికి తిరిగి రాబోతున్నట్లుగా ప్రకటించారు. 2009లో సౌతాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫెమా (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో అప్పీలేటు ట్రిబ్యునల్ (SAFEMA) నుంచి ఆయనకు భారీ ఊరట లభించింది. దీంతో లలిత్ మోడీ స్వదేశాగమనంపై కీలక ప్రకటన చేశారు. అయితే, 2009 ఐపీఎల్ సీజన్‌ను సార్వత్రిక ఎన్నికల భద్రతా కారణాల వల్ల ఇండియా నుంచి సౌతాఫ్రికాకు తరలించారు. కానీ, ఆ సమయంలో విదేశీ కరెన్సీ చెల్లింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈడీ (ED) నమోదు చేసిన కేసును, విధించిన భారీ జరిమానాలను అప్పీలేటు ట్రిబ్యునల్ కొట్టేసింది. అదేవిధంగా లలిత్ మోదీపై మోపిన అభియోగాల్లో ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని, ఆ వ్యవహారంలో ఎలాంటి వ్యక్తిగత తప్పులు లేవని తీర్పునిచ్చింది.
నా నిజాయితీ గెలిచింది.. లలిత్ మోదీ
ట్రిబ్యునల్ తీర్పుపై లలిత్ మోదీ రియాక్ట్ అయ్యారు. ‘గడిచిన 16 ఏళ్లుగా నేను పోరాడుతున్నాను. మీడియాకు, ప్రజలకు నేను మొదటి నుంచీ చెబుతున్నది నిజమని ఈ తీర్పు ద్వారా నిరూపితమైంది. నేను ఎల్లప్పుడూ ఐపీఎల్, భారత క్రికెట్ శ్రేయస్సు కోసమే పనిచేశా. సుదీర్ఘ అధ్యాయం ఇప్పుడు పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్‌లో నా కుమార్తెకు సంతానం కలగబోతోంది. ఈ ఏడాది చివర్లో.. లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో తప్పకుండా ఇండియాకు తిరిగి వస్తా’ అని లలిత్ మోడీ తెలిపారు. కాగా, 2010లో వివాదాలు చుట్టుముట్టిన తర్వాత లలిత్ మోదీ లండన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ 16 ఏళ్ల విచారణల తర్వాత తాజాగా తీర్పు రావడం ఆయన మళ్లీ భారత్‌లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది.






