కేపీహెచ్‌బీలో 470 గ్రాముల గంజాయి స్వాధీనం

by Batti.Sumithra |

కేపీహెచ్‌బీ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.

కేపీహెచ్‌బీలో 470 గ్రాముల గంజాయి స్వాధీనం
X

దిశ, బాలానగర్ : కేపీహెచ్‌బీ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 470 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో హన్మంతరావు తెలిపారు. అరెస్టైన నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన సి. అఖిల్ బాబుగా గుర్తించారు. అతడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Next Story