- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
by Taduka Kalyani |
ఓవర్ టేక్ చేసే క్రమంలో కారు బోల్తా పడిన ఘటన కడ్తాల్ మండలం కర్కలపహాడ్ శివారులో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

X
దిశ, ఆమనగల్లు : ఓవర్ టేక్ చేసే క్రమంలో కారు బోల్తా పడిన ఘటన కడ్తాల్ మండలం కర్కలపహాడ్ శివారులో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రాయిని బలంగా ఢీకొని బోల్తా పడింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






