మీరు గాంధీభవన్ కొస్తే మేము బీజేపీ ఆఫీసు ముట్టడిస్తాం

by Taduka Kalyani |

మీరు గాంధీభవన్ కి వస్తే మేము బీజేపీ ఆఫీసును ముట్టడిస్తామని జగ్గారెడ్డి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు కౌంటర్ వేశారు.

మీరు గాంధీభవన్ కొస్తే మేము బీజేపీ ఆఫీసు ముట్టడిస్తాం
X

దిశ, సంగారెడ్డి : మీరు గాంధీభవన్ కి వస్తే మేము బీజేపీ ఆఫీసును ముట్టడిస్తామని జగ్గారెడ్డి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు కౌంటర్ వేశారు. బుధవారం రెండో రోజూ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ ఘటనపై రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మీకు చేతనైతే ప్రధాని మోడీతో విద్యార్థులకు క్షమాపణ చెప్పించాలని అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేదంటే తెలంగాణ బిజెపి నాయకులను, కేంద్ర మంత్రులని ఘెరావ్ చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ విద్యార్థులకు కనీసం క్షమాపణ చెప్పలేదనీ, ప్రధాని మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రధాని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మతం, దేవుడి పేరుతో ఓట్లు తెచ్చుకున్న బీజేపీకి విద్యార్థుల సమస్యలు పట్టవా అంటూ ఆయన మండిపడ్డారు. అంతకుముందు రెండో రోజు నిరసనలో భాగంగా జగ్గారెడ్డి తన సతీమణి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలను బైక్ పై ఎక్కించుకొని వందలాది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

Next Story