- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొండాలో బొద్దింక..
హోటల్ లో టిఫిన్ చేస్తున్న వినియోగదారుడికి బొండాలో బొద్దింక రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

దిశ, గండిపేట: హోటల్ లో టిఫిన్ చేస్తున్న వినియోగదారుడికి బొండాలో బొద్దింక రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇదేమని ప్రశ్నించిన హోటల్ సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడలో బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడలోని న్యూ ఉడిపి శ్రీ కృష్ణ హోటల్ కు స్థానికంగా నివాసముండే మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్లాడు. బోండా ఆర్డర్ చేసి తింటుండగా బోండాలో బొద్దింక కనిపించింది. వెంటనే హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు. అనంతరం హోటల్ కిచెన్‌తో పాటు పరిసరాలను పరిశీలించగా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించ్చినట్లు పేర్కొన్నాడు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఆహార భద్రతా తనిఖీలు సక్రమంగా జరగకపోవడం వల్ల కొంతమంది హోటళ్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హోటళ్లపై తరచూ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






