- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభం..
పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం పక్కన ఎస్ బిఎం -2.0 అర్బన్ పథకం కింద రూ. 20 లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్‌లను నిర్మించారు.

దిశ, చొప్పదండి: పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం పక్కన ఎస్ బిఎం -2.0 అర్బన్ పథకం కింద రూ. 20 లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్‌లను నిర్మించారు. కానీ నిర్మాణం చేసి వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో పబ్లిక్ టాయిలెట్స్ లేక పట్టణంతో పాటు మండల ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్న సందర్భంలో " లక్షలు వెచ్చించారు. లక్షణంగా వదిలేశారు" అనే కథనం దిశ పత్రికలో ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన మున్సిపల్ అధికారులు ప్రారంభించడానికి తగు ఏర్పాట్లు చేశారు. బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి నరితశ్రీనివాస్ పబ్లిక్ టాయిలెట్స్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమములో వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస గంగయ్య గౌడ్, కౌన్సిలర్ లు గుర్రం రాజేందర్రెడ్డి, గుర్రం సుజిత్రెడ్డి, పిట్టల వెంకటేష్, కమీషనర్ కీర్తి నాగరాజు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తేజస్విని, మున్సిపల్ ఎ.ఈ నరేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, జూనియర్ సహాయకులు అంజయ్య, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎస్.శివాణి, కొట్టె అశోక్, శ్యాంసుందర్, ముద్దం తిరుపతిగౌడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






