- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల అదుపులో మాజీ మంత్రి అప్పలరాజు... పోలీస్ స్టేషన్‌కు తరలింపు
శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీదిరి కుమారుడు ఆరవ్ హిట్ అండ్ రన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో A3గా సీదిరి అప్పలరాజు ఉన్నారు. తన కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై అభియోగాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఈ నేపథ్యంలో సోంపేట కోర్టులో సీదిరి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. అటు అప్పలరాజు కుమారుడి కోసం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో అప్పలరాజు నివాసానికి పోలీసులు వెళ్లారు. భారీ బలగాల మధ్య సీదిరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సీదిరికి మరింత ఉచ్చు బిగుస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి.
కాగా సీదిరి అప్పలరాజు కుమార్ ఆరవ్ కాశీబుగ్గలో బైక్ నడుపుతూ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టారు. ఈ ఘటనలో దానయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ కేసులో మరో వ్యక్తి ప్రమాదం చేసినట్లుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌నే దానయ్య ఢీకొట్టిన తేలింది. దీంతో కేసును తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నం చేసినట్లు కూడా స్పష్టమైంది. ఈ మేరకు సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఇదే కేసులో సాక్ష్యలు తారు మారు చేశారనే ఆరోపణలపై అప్పలరాజు ఏ3 నిందితుగా ఉన్నారు. దీంతో సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.






