మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మహిళా ఉద్యమకారులను గుర్తించాలి..

by Kodari Anjali |

తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మహిళా ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని తెలంగాణ మహిళా జేఏసీ మలి దశ ఉద్యమకారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మహిళా ఉద్యమకారులను గుర్తించాలి..
X

దిశ, హిమాయత్ నగర్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మహిళా ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని తెలంగాణ మహిళా జేఏసీ మలి దశ ఉద్యమకారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్లు ప్రమీల సాబిదా సికిందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జానకి రెడ్డిలతో కలసి చైర్పర్సన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ఉద్యమకారులను గుర్తించలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడానికి కేకే కమిటీని నియమించారు. కానీ అందులో మహిళా సభ్యులను నియమించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులు, కవులు, కళాకారులు, అడ్వకేట్స్, మహిళా ఉద్యోగులు గుర్తించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని… అందులో మహిళలను భాగస్వామ్యం చేయాలని కోరారు. త్వరలోనే మహిళా మహా సభ నిర్వహిస్తామని భాగ్యలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గౌరి, ఉపాధ్యక్షులు వుము, సబితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story