- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ చీఫ్ సెక్రటరీతో ఎస్సీసీఆర్ జనరల్ మేనేజర్ భేటీ
by Kodari Anjali |
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, వాటి అమలుకు అవసరమైన సమన్వయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న మరియు ప్రతిపాదిత రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలపై సమావేశంలో అభిప్రాయాలు పంచుకున్నారు.
Next Story






