‘టాక్సిక్’ లో బోల్డ్ సీన్లు..వాళ్లు మాత్ర‌మే మూవీ చూడాలి!

by velandi.Saikiran |

‘టాక్సిక్’ లో బోల్డ్ సీన్లపై నిర్మాత కేవీన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

‘టాక్సిక్’ లో బోల్డ్ సీన్లు..వాళ్లు మాత్ర‌మే మూవీ చూడాలి!
X

దిశ‌, వెబ్ డెస్క్: కేజీఎఫ్ 2 తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న యష్... ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యష్ హీరోగా చేస్తుండగా... మొత్తం ఐదుగురు హీరోయిన్లు మెరువనున్నారు. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, తార సుతారియా ఈ సినిమాలో రచ్చ చేయనున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ అదరగొట్టాయి. టీజర్ కూడా బాగానే ఉంది. ఈ మూడు అప్డేట్స్ లో అన్ని బోల్డ్ సీన్లే.

ఫ్యామిలీతో చూసే సినిమా లాగా ఇది అస్సలు కనిపించడం లేదు. మూడో సాంగ్ కూడా త్వరలో రాబోతుందట. ఇందులో రుక్మిణి వసంత్ తో యష్ రొమాన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ నిర్మాత వెంకట్ కె నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ మామూలుగా ఉండబోదని... పెద్దలు మాత్రమే థియేటర్ కు రావాలంటూ హెచ్చరించారు. అంటే చిన్న పిల్లలు, సెన్సిటివ్ వ్యక్తులు ఈ సినిమా చూడకూడదని పరోక్షంగా హిట్ ఇచ్చారు నిర్మాత. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన రిలీజ్ కానుంది.

Next Story