సెమిస్టర్ నిర్వహించట్లేదని స్టూడెంట్స్ ఆందోళన...

by Batti.Sumithra |

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జయముఖి ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

సెమిస్టర్ నిర్వహించట్లేదని స్టూడెంట్స్ ఆందోళన...
X

దిశ, చెన్నరావుపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జయముఖి ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గడిచిన రెండు నెలలుగా సెమిస్టర్ , ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కాలేజీకి చేరుకున్న విద్యార్థులు ఫీజులు వసూలు చేసి పరీక్షలు నిర్వహించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కాలేజీ యాజమన్యంలో తలెత్తిన వివాదాలు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సైతం సమస్యను తీసుకెళ్లారు. ఉన్నత విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీ గేటుకు తాళం వేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే 23 వ తేదీన నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నాచేస్తామని విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story